Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్ ఫెయిల్ - కొండపై నుంచి పల్టీలు కొట్టిన పెళ్లి బృదం ట్రాక్టర్... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (12:12 IST)
తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఘోరం జరిగింది. వివాహానికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరిన పెళ్లిబృందం ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈ ఘోరం జరిగింది. 
 
పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్ వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
కాగా, మృతులు గోకవరం మండలం టాకుర్‌పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments