Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంకనేసుకుని పొలంగట్లకు తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడి.. ఆపై బురదలో వేసి తొక్కేశాడు...

వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ళ బాలికపై తాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని పొలం బురదలో వేసి తొక్కి చంపాడు. ఈ అమానుష ఘటన వివరాలు తాజా వెలుగులోకి వచ్చాయి. ఈ వివర

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (10:38 IST)
వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ళ బాలికపై తాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని పొలం బురదలో వేసి తొక్కి చంపాడు. ఈ అమానుష ఘటన వివరాలు తాజా వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గణపవరం మండలం కేశవరం గ్రామానికి చెందిన గంగిరెద్దుల జాతికి చెందిన బొడ్డి ఏసు (50) సంత మార్కెట్‌లో డేరాలు వేసుకుని జీవిస్తున్నాడు. గత నెల 29వ తేదీన ఉగాది రోజున ఇంటిలో ఎవ్వరూలేని సమయంలో తన మనుమరాలు మేరీ రాణిని (రెండున్నరేళ్ళు) రాత్రి 8 గంటల సమయంలో చంకనేసుకుని సమీప పొలం గట్ల వద్దకు తీసుకువెళ్ళి లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత అతికిరాతకంగా బురదలోకి తొక్కి చంపేశాడు.
 
పిమ్మట ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చి.. తెల్లవారుజామున భిక్షాటన కోసం వెళ్ళిపోయాడు. ఇదిలావుంటే తన కుమార్తె కనబడకపోవడంతో ఏసు కుమారుడు, కోడలు రాత్రి నుంచి వెతకగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పంటబోదె బురదలో మృతదేహం లభ్యం కనిపించింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది తన మామ ఏసేనని గుర్తించి కోడలు పోసమ్మ గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంత ఏసును అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం