Webdunia - Bharat's app for daily news and videos

Install App

Zika Virus: నెల్లూరులో ఐదేళ్ల బాలుడికి జికా వైరస్.. చెన్నైలో ట్రీట్మెంట్

సెల్వి
శుక్రవారం, 20 డిశెంబరు 2024 (12:04 IST)
నెల్లూరు జిల్లాలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడికి జికా వైరస్ పరీక్షలు నిర్వహించగా, అతని రక్త నమూనాను నిర్ధారణ కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపారు. బాలుడిని మెరుగైన  చికిత్స కోసం చెన్నైకి తరలించినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు.
 
మాకు అనుమానిత కేసు ఉంది, కానీ అది ఇంకా నిర్ధారించబడలేదు. ప్రజలకు భరోసా ఇస్తూ, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నందున భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు. దీనిపై నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా స్పందించారు. 
 
బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నై తరలించినట్లు ఆనం చెప్పారు. మరోవైపు బాలుడికి సోకింది జికా వైరస్ అవునో కాదో తెలుసుకోవడం కోసం బాలుడి నుంచి రక్త నమూనాలను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపించినట్లు మంత్రి చెప్పారు. 
 
లక్షణాలు.. 
జికా వైరస్ కేసులు సాధారణంగా బ్రెజిల్, అమెరికాలో కనిపిస్తుంటాయి. జికా వైరస్ అనేది చాలావరకూ మామూలు వైరస్ అయినా కూడా.. కొంతమందిలో సీరియస్ కావచ్చు. డెంగీ, చికెన్ గున్యా తరహాలోనే జికా వైరస్ కూడా దోమల ద్వారా వస్తుంది. 
 
జికా వైరస్ మామూలు వైరల్ జబ్బు అయినప్పటికీ ఒక్కోసారి గిలియన్ బ్యారీ సిండ్రోమ్‌ కారణంగా కాళ్లు తాత్కాలికంగా చచ్చుబడే ప్రమాదం ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా జికా వైరస్ గర్భిణులకు ఇబ్బందికరంగా మారుతుంది. గర్భస్థ శిశువుల్లో మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments