Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న‌పిల్ల‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి 5 ఎక‌రాల స్థ‌లం: టిటిడి ఈవో

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (09:39 IST)
తిరుప‌తిలో పూర్తిస్థాయిలో చిన్న‌పిల్ల‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి అనువైన‌ 5 ఎక‌రాల స్థ‌లాన్ని గుర్తించాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.
 
 ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులకు పార్కింగ్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా తిరుప‌తిలోని అలిపిరిలో, తిరుమ‌ల‌లోని అనువైన ప్రాంతంలో మ‌ల్టీలెవ‌ల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు క‌నువిందు చేసేలా ముఖ్య కూడ‌ళ్ల‌లో ఎత్తుగా పెరిగే బంతి పూల మొక్క‌లు పెంచాల‌న్నారు.

అలిపిరి న‌డ‌క‌మార్గంలో భ‌క్తులు ఇబ్బందులు ప‌డ‌కుండా పైక‌ప్పు నిర్మాణ ప‌నులు కొన‌సాగించాలని సూచించారు. టిటిడి ప‌రిధిలోకి తీసుకున్న ఆల‌యాల్లో రోజువారీ పాల‌నా వ్య‌వ‌హారాలు నిర్వ‌హించేందుకు స‌మ‌గ్ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాల‌న్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ధ‌ర్మ‌ప్ర‌చారం చేసేందుకు వీలుగా నిర్దేశిత వ్య‌వ‌ధిలో ధ‌ర్మ‌ప్ర‌చార ర‌థాలు సిద్ధం చేయాల‌ని సూచించారు. టిటిడి విద్యాసంస్థ‌ల్లో బ‌యోమెట్రిక్ అటెండెన్స్ అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఎస్వీబీసీలో  ఒక సంవ‌త్స‌ర కాలానికి అవ‌స‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌తో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ సిద్ధం చేయాల‌ని ఎండిని కోరారు. టిటిడిలోని పాత రికార్డుల‌ను డిజిటైజేష‌న్ చేయాల‌న్నారు. స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక పాఠ‌కాస‌క్తి పెంచేందుకు వీలుగా మంచి పండితులు, ర‌చ‌యిత‌ల‌తో వ్యాసాలు రాయించాల‌ని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments