Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్రపూజల కోసం ఇంట్లోనే నాలుగేళ్ళ బాలుడి తల తెగనరికిన కసాయి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2015 (16:19 IST)
టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా మూఢ విశ్వాసాలు ప్రజలను వీడిపోవడం లేదు. ఫలితంగా అభంశుభం తెలియని చిన్నారులను నరబలి పేరుతో దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో క్షుద్రపూజల కోసం నాలుగేళ్ళ బాలుడి తల తెగనరికి నరబలి ఇచ్చిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాలను పరిశీలిస్తే.. 
 
ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామానికి చెందిన తిరుమల రావు అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ అంగన్‌వాడీ పాఠశాలలో చదువుకునే మనోజ్ సాయి అనే నాలుగేళ్ళ బాలుడికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. తన ఇంట్లోనే దేవుళ్ల ఫోటోల ముందు కొద్దిసేపు కూర్చోబెట్టి.. పూజలు చేసి ఆ తర్వాత మనోజ్ సాయి తల నరికేశాడు. తమ పిల్లోడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గ్రామమంతా వెతికారు. 
 
అయితే, తిరుమలరావు బాలుడిని తీసుకెళ్తుండగా ఇరుగుపొరుగువారు గుర్తించారు. ఈ విషయం ఆ బాలుడి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తిరుమలరావు ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే బాలుడు తల, మొండెం వేరు చేసి పూజలు చేస్తున్నాడు. బాలుడి మృతదేహాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన బంధువులు తిరుమలరావును పట్టుకుని చితకబాదారు. ఆతర్వాత శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 
 
ఈ నరబలి సమాచారం తెలుసుకున్న పోలీసులు హూటాహుటిన గ్రామానికి చేరుకుని మంటల్లో కాలిపోతున్న తిరుమలరావును రక్షించారు. తీవ్రగాయాలపాలైన తిరుమలరావును కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. క్షుద్ర పూజలు చేస్తే కలిసొస్తుందని ఎవరో చెప్పడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments