Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెనాలిలో పునీత్ రాజ్‌కుమార్‌ విగ్రహం.. 21 అడుగుల ఎత్తు.. 3డీ టెక్నాలజీ!

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (11:32 IST)
Puneeth Raj kumar
తెనాలిలో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ భారీ విగ్రహం సిద్ధమైంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలు భారీ ఫైబర్‌ గ్లాస్‌ విగ్రహాన్ని రూపొందించారు. 21 అడుగుల ఎత్తులో ‘3డి’ సాంకేతికతతో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
 
ఈ విగ్రహాన్ని రెడీ చేసేందుకు నాలుగు నెలల సమయం పట్టింది. బెంగళూరులో ప్రదర్శన కోసం ఈ విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆవిష్కరించి, శిల్పులను అభినందించారు. 
 
అలాగే ‘3డి’ సాంకేతికతతో తయారుచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిన్న ప్రతిమను శిల్పి శ్రీహర్ష ఎమ్మెల్యేకు బహూకరించారు. త్వరలోనే పునీత్ రాజ్‌కుమార్ విగ్రహాన్ని బెంగళూరుకు తరలించనున్నారు.
 
మరోవైపు బెంగళూరులో పునీత్‌రాజ్‌కుమార్‌ పేరిట నిర్మించిన పార్కు ప్రారంభమయ్యింది. పునీత్‌ రాజ్‌కుమార్‌ గతేడాది అక్టోబర్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments