Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే డైరీలు - క్యాలెండర్లు ఆన్‌లైన్‌లో విక్రయం : బీఆర్ నాయుడు

ఠాగూర్
శుక్రవారం, 20 డిశెంబరు 2024 (16:17 IST)
భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. కొత్త యేడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. నిజానికి వీటిని ఇప్పటి వరకు ఆఫ్‌లైన్, పోస్టల్ విధానం ద్వారానే విక్రయిస్తూ వచ్చారు. అయితే, ఇకపై ఆన్‌‍లైన్‌లోనే ఆర్డర్ చేసే వారికి క్యాలెండర్లు, డైరీలను పంపిస్తామని తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 
 
2025 యేడాదికి సంబంధించి 12 పేజీలు, 6 పేజీలు, సింగిల్ షీట్, టేబుల్ టాప్ క్యాలెండర్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద సైజు, శ్రీ పద్మావతి సమేతంగా శ్రీవారి ఫొటోతో క్యాలెండర్లను తయారుచేసినట్లు చెప్పారు. 
 
వీటితో పాటు డీలక్స్ డైరీలు, చిన్న డైరీలను కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని వివరించారు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలు కావాల్సిన వారు www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైనులో బుక్ చేసుకోవచ్చని అన్నారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులలోని ప్రముఖ బుక్ స్టోర్లలో శ్రీవారి క్యాలెండర్లను నేరుగా కొనుగోలు చేయవచ్చని బీఆర్ నాయుడు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments