Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత్యు లారీ 20 మందిని చంపేసింది... ధర్నా శిబిరంలోకి దూసుకెళ్లింది....

చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో శుక్రవారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. పూతలపట్టు- నాయుడుపేట రహదారిలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని దుకాణాల‌పై

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (15:13 IST)
చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో శుక్రవారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. పూతలపట్టు- నాయుడుపేట రహదారిలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని దుకాణాల‌పైకి ఒక్క‌సారిగా లారీ దూసుకురావ‌డంతో అక్క‌డి జ‌న‌మంతా ప‌రుగులు పెట్టార‌ు. లారీ సృష్టించిన బీభ‌త్సంతో అక్క‌డ విద్యుదాఘాతం కూడా చోటుచేసుకుంది. దీంతో లారీ కింద పడి కొందరు.. విద్యుత్ షాక్ తగిలి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఫలితంగా 20 మందికి పృగా చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. దీంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఏర్పేడులోని పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న స్థానికులపై ఈ లారీ వేగంగా వచ్చి దూసుకెళ్లింది. దీంతో ఈ ఘోర విషాదం జరిగింది. 
 
మరోవైపు ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదం గురించి తెలుసుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. చిత్తూరు జిల్లా క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి ఆయ‌న వివ‌రాలు తెలుసుకున్నారు. ఘ‌ట‌నా స్థలికి క‌లెక్ట‌ర్ ప్ర‌ద్యుమ్న బ‌య‌లుదేరారు. మ‌రోవైపు ఈ ఘోర‌ప్ర‌మాదంపై స్పందించిన హోం మంత్రి చినరాజ‌ప్ప తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీతో ఫోనులో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. 
 
క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన సౌక‌ర్యం అందించాల‌ని ఆదేశించారు. ఈ ప్ర‌మాదంపై రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస రావు విచారం వ్య‌క్తం చేశారు. గాయాల‌పాల‌యిన వారిని రుయా, స్విమ్స్‌, శ్రీ‌కాళ‌హ‌స్తి సీహెచ్‌సీ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు చెప్పారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడి ట్రాఫిక్‌ను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments