Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ జూలో ఆడ సింహం మహేశ్వరికి గుండెపోటు...

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (12:11 IST)
విశాఖపట్టణంలోని జూలో ఉన్న ఆడసింహం మహేశ్వరికి గుండెపోటు వచ్చింది. దీంతో అది మృత్యువాతపడింది. మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌తో మహేశ్వరి మృతి చెందినట్టు జూ అధికారులు తెలిపారు. గత 2006లో గుజరాత్‌లో జన్మించి దీనిని 2019లో వైజాగ్ జూకు తరలించారు. సింహాల జీవితకాలం గరిష్టంగా 18 యేళ్లే అయినప్పటికీ 19వ యేట మరణించడం గమనార్హం. 
 
విశాఖపట్టణంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కులో ఉన్న మహేశ్వరికి శనివారం రాత్రి గుండెపోటు వచ్చిందని జూ అధికారులు తెలిపారు. వయసు మీదపడటంతో మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌తో అది మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలిందని తెలిపారు. 
 
గత 2006లో జన్మించిన మహేశ్వరి 2019లో గుజరాత్ రాష్ట్రంలోని సక్కర్ బాగ్ జూ నుంచి వైజాగ్ జూకు తరలించారు ఇది లక్షలాది మంది ఆసియాటిక్ సింహాలపై అవగాహన అందించడంతో పాటు సింహాల పరిరక్షణకు తోడ్పడినట్టు జూ అధికారులు తెలిపారు. సాధారణంగా సింహాల వయసు 16 నుంచి 18 యేళ్లు మాత్రమే జీవిస్తాయని కానీ మహేశ్వరి మాత్రం 19వ యేటలోకి అడుగుపెట్టిందని వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments