Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్‌టీయూ-అనంతపూర్‌లో ర్యాగింగ్ కలకలం : 18 మంది సస్పెండ్

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (08:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ)లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పలువురు సీనియర్ విద్యార్థులు కొందరు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేదించారు. ఈ వ్యపహారం వెలుగు చూడటంతో తక్షణం స్పందించిన జేఎన్టీయూ ప్రిన్సిపాల్ తొలుత 11 మంది సీనియర్ విదార్థులను సస్పెండ్ చేశారు. 
 
ఆ తర్వాత ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు కొందరు అధ్యాపకులతో కలిసి అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ర్యాగింగ్ అంశంపై లోతుగా విచారణ జరిపింది. ఇందులో కొందరు సీనియర్ విద్యార్థులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తేలింది. 
 
ఈ ర్యాగింగ్‌కు మొత్తం 18 మంది పాల్పడినట్టు తేలడంతో వారిని తక్షణం సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీచేశారు. ఈ కాలేజీలో చదివే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేకాకుండా మరో ముగ్గురు సీనియర్ విద్యార్థులు కూడా ర్యాంగింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments