Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్ర‌బాబు నియోజ‌వ‌ర్గం కుప్పంలో తమ్ముళ్ల తిరుగుబాటు...

క‌డ‌ప‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేశారు. నియోజకవర్గ కేంద్రం, మేజర్ గ్రామ పంచాయితీ కుప్పం పట్టణంలో వార్డు సభ్యులుగా ఉన్న 16 మంది పదవులకు రాజీనామాలు చేసి, పత్రాలను స్థానిక మండల

Webdunia
శనివారం, 30 జులై 2016 (20:05 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేశారు. నియోజకవర్గ కేంద్రం, మేజర్ గ్రామ పంచాయితీ కుప్పం పట్టణంలో వార్డు సభ్యులుగా ఉన్న 16 మంది పదవులకు రాజీనామాలు చేసి, పత్రాలను స్థానిక మండల పరిషత్‌ కార్యాలయానికి చేర్చారు. మేజర్‌ గ్రామ పంచాయతీ అయిన కుప్పంలో 20 మంది వార్డు సభ్యులతో పాలకవర్గం ఉంది. ప్రస్తుతం 16 మంది వార్డు సభ్యులు మూడేళ్లుగా అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తూ, రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
మూడేళ్లుగా కుప్పం పట్టణాభివృద్ధి కోసం విడుదలైన నిధులపై ఎలాంటి లెక్కలూ లేవంటూ ఈ సందర్భంగా ఆరోపించారు. డంపింగ్‌ యార్డు శుభ్రం చేయడం కోసం రూ.25 లక్షలు ఎస్‌టీఎఫ్‌ నిధుల ద్వారా రూ.4.5 కోట్లు ఖర్చుపై ఇంత వరకు లెక్కలు చూపిన దాఖాలు లేవని తెలిపారు. దీంతో పాటు పంచాయతీ ఆదాయ వ్యయాలు, ఆస్తుల వివరాలపై ఎలాంటివి వెల్లడించలేదని ఆరోపించారు. 
 
రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ కాలువ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపిస్తూ, తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండల పరిషత్‌ అధికారులు లేకపోవడంతో రాజీనామా పత్రాలను కలెక్టర్‌కు పంపిస్తున్నట్లు సభ్యులు తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments