Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా - 12 మంది గల్లంతు

Webdunia
ఆదివారం, 14 మే 2023 (15:13 IST)
ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ రిజర్వాయర్‌లో కొందరు పర్యాటకులు బోటులో షికారు చేస్తుండగా అది ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో పడవలోని 12 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. 
 
ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో అవుకు రిజర్వాయర్ ఉంది. ఇక్కడకు కొంతమంది పర్యాటకులు విహారయాత్రకు వచ్చారు. వారిలో కొందరు బోటులో ప్రయాణిస్తూ రిజర్వాయర్‌లో షికారు చేస్తుండగా ఒక్కసారిగా పడవ బోల్తాపడింది. ఇందులోని 12 మంది గల్లంతయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపకదళ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు, ఇప్పటివరకు రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వారంతా చనిపోయివుంటారని పోలీసులు భావిస్తున్నారు. పర్యాటకులంతా తమిళనాడులో రాష్ట్రంలోని తంజవూరుకు చెందిన వారిగా భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments