Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామెర్లకు చికిత్స చేయమని ఆస్పత్రికి తీసుకెళ్తే శిశువును మాయం చేశారు...

Webdunia
బుధవారం, 8 మే 2019 (10:11 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఓ దారుణం జరిగింది. కామెర్లకు చికిత్స చేయమని ఓ శిశువును తీసుకెళ్తే ఆస్పత్రి సిబ్బంది ఆ బిడ్డను మాయం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సంగారెడ్డి జిల్లాలోని కల్పగూర్ గ్రామానికి చెందిన హన్మోజిగారి మాధవి (28) అనే మహిళ గత నెల 30వ తేదీన ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 3వ తేదీన బిడ్డకు పచ్చకామెర్లు రావడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు శిశువును ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. 
 
ఈ క్రమంలోమంగళవారం ఉదయం గుర్తుతెలియని మహిళ ఎస్‌ఎన్‌సీయూలోకి వచ్చింది. అక్కడే ఉన్న ఆయా వనిత ఆమెను మాధవిగా భావించి బిడ్డను ఆమెకు అప్పగించింది. ఆ తర్వాత కాసేపటికి తన బిడ్డ వద్దకు తల్లి మాధవి వెళ్ళగా, పడకపై బిడ్డ కనిపించలేదు. దీంతో ఆయాను ప్రశ్నించగా, ఇపుడే కదా మీకు బిడ్డకు అప్పగించాను అని చెప్పడంతో తల్లి మాధవి ఖంగుతిన్నారు. 
 
ఆయా వనిత నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మాయమైందని మాధవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వారు ఆగ్రహానికి గురై ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆసుపత్రిలోని ఆర్‌ఎంఓ ఛాంబర్‌లో సీసీ ఫుటేజీలను పరీక్షించగా బిడ్డను ఓ గుర్తు తెలియని మహిళ బయటకు తీసుకెళ్తున్నట్టు రికార్డైంది. జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా వనితను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments