అబ్బే.. మా మధ్య విభేదాలు లేవు.. మేమంతా ఒక్కటే: కేకే

Webdunia
సోమవారం, 10 జనవరి 2011 (18:38 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతల విశ్వసనీయతను ఆ ప్రాంత ప్రజలు శంకిస్తున్నారు. ఇదే అంశంపై మీడియాలో ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం అవుతున్నాయి. పైపెచ్చు.. టి కాంగ్రెస్ నేతల్లో విభేదాలు పొడసూపినట్టు వార్తలు వస్తున్నాయి.

వీటిపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తన, తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదన్నారు.

తెలంగాణలో హైదరాబాద్ ఒక భాగమని అన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను అందించిన తర్వాత నగరానికి వచ్చిన కేకేతో పలువురు కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు.

ఇదిలావుండగా, భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను రచించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మంగళవారం మధ్యాహ్నం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం సికింద్రాబాద్‌లోని కేజేఆర్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమౌతుందని ఆ ప్రాంత సీనియర్ నేత యాదవ్ రెడ్డి సోమవారం వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

Show comments