రాష్ట్ర విభజనకు హైదరాబాదే పీఠముడి: మంత్రి జైపాల్ రెడ్డి

Webdunia
సోమవారం, 10 జనవరి 2011 (15:46 IST)
రాష్ట్ర విభజనకు హైదరాబాదే ప్రధాన పీఠముడిగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు, మంత్రులు సోమవారం ఢిల్లీలో జైపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదరాబాదే ఓ చిక్కుముడి అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదారాబాద్ సమస్యగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నాయకుల్లోనూ పునరాలోచన ప్రారంభమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్షీరసాగర మథనం చేస్తోందని, ఇది ఆలస్యమైనప్పటికీ.. చివరకు అమృతం లభిస్తుందన్నారు.

ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవమేనన్నారు. క్షేత్రస్థాయి పునాదుల్లోకి తెలంగాణవాదం చొచ్చుకుపోయిందన్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎక్కువ మంది, తెలంగాణ పార్లమెంటు సభ్యులు తక్కువ మంది ఉన్నారని, ఇది కూడా సమస్యకు ఓ ప్రధాన కారణంగా మారిందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిట్టి పికిల్ రమ్య మంచి బాడీ బిల్డర్, బిగ్ బాస్ ట్రోఫీ గెలవాల్సింది: దువ్వాడ శ్రీనివాసరావు

Vijay Deverakonda: రాక్షసుడిని అంతమెందించే రౌడీ జనార్థన టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

Flim Chamber: సినిమాకు ఆపరేషన్‌ చేయాలంటే అందరూ డాక్టర్లేనా !

Sharwa: నారి నారి నడుమ మురారి పొట్టపగిలి నవ్వేలా వుంటుంది : శర్వా

Mohan Lal: వృష‌భ‌ మూవీ చివరి దాకా ఆసక్తిగా చూసేలా ఉంటుంది : బన్నీ వాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు

ఫ్యాషన్‌లో కొత్త విప్లవాన్ని సృష్టిస్తున్న బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తిరుపతిలో రోబోటిక్ సర్జరీపై సదస్సు: భారీ ఫైబ్రాయిడ్ తొలగింపుతో ప్రపంచ రికార్డు దిశగా గ్లీనీ ఈగల్స్ హాస్పిటల్ చెన్నై

కోడిగుడ్డుతో కేన్సర్ రాదు, నిర్భయంగా తినేయండి అంటున్న FSSAI

కమలా పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments