Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీపీఎం.. సీపీఐ బంతులు ఇంకా పైకెగురుతాయ్: రాఘవులు

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2012 (18:40 IST)
FILE
సీపీఎం, సీపీఐ పార్టీలను ఎంత అణదొక్కాలని చూస్తే అవి బంతుల్లా అంత పైకి లేస్తాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సీపీఎం 23వ మహాసభలో ఆయన ప్రసంగించారు.

వామపక్ష పార్టీలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. ఆ భయంతో పార్టీలను అణదొక్కేందుకు రకరకాల కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. అయితే తమను ఎంతగా అదిమి పెడితే అంతగా పైకి లేస్తామని అన్నారు.

దేశంలోని మొత్తం 11 కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించాలని నిర్ణయించామన్నారు. పార్టీల మధ్య చిన్నచిన్న విభేదాలున్నప్పటికీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ముందుకు నడుస్తామని చెప్పుకొచ్చారు.

మద్య నిషేధం, విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామన్నారు. కమ్యూనిస్టు పార్టీల నాయకులు మద్యం తాగరనీ, కానీ పూటుగా మందుకొట్టే బూర్జువా పార్టీలు మద్యపాన నిషేధం అంటూ గొంతు చించుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఈ బూర్జువా పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లో చెలిమి చేసేది లేదని అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments