Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధుల్లో తిరిగే పిచ్చికుక్క ఆ వీహెచ్: జగన్ వర్గం ఎదురుదాడి

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2010 (10:12 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరిగా చెప్పుకుంటున్న రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. వీహెచ్‌ను వీధుల్లో తిరిగే పిచ్చికుక్కతో పోల్చారు. మీడియా ప్రచారం కోసం గజ్జి, పిచ్చి పట్టిన కుక్క అరిచేలా అరుస్తుంటాడని ఆరోపించారు. గల్లీ స్థాయి నేతకు కూడా సమానం కాని వీహెచ్‌ టెన్ జనపథ్ చుట్టూ ప్రదక్షిణలు చేసి టిక్కెట్ సంపాదించుకున్నాడని వారు ఆరోపించారు.

కాంగ్రెస్‌ను విమర్శించే ముందు నీ స్థితిగతులేంటో నీ స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని కడప మాజీ ఎంపి జగన్‌ను హనుమంతరావు సూచించిన విషయం తెల్సిందే. దీనిపై జగన్ వర్గీయులైన కొందరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎందుకూ పనికిరాని నేతలు కూడా జగన్‌ను విమర్శించడం దినచర్యగా మారిందన్నారు. వీహెచ్‌తో పాటు మరికొంత మంది నేతలు వీధుల్లోకి వచ్చినా చివరకు పిచ్చికుక్కలు కూడా మొరగవని వారు దుయ్యబట్టారు.

తమనేతను విమర్శిస్తే ఇక సహించే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. ఇన్ని రోజులూ సహించామని, ఇకపై ప్రతి చర్య తప్పదని వారు స్పష్టం చేశారు. అందువల్ల నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని వారు సూచించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments