Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లో గోడమీద పిల్లిలా మారిన నటి జయప్రద!?

Webdunia
గురువారం, 8 నవంబరు 2012 (17:06 IST)
FILE
మాజీ హీరోయిన్ జయప్రద రాజకీయాల్లో గోడమీద పిల్లిలా తయారయ్యారు. యూపీ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన జయప్రద తన మనస్సులోని మాటను బయటపెట్టారు. తన మనసంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అంకితమని, ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారిస్తానన్నారు.

అతి త్వరలో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తానని అన్నారు. ఏ పార్టీలో చేరుతారని విలేకరులు అడిగిన ప్రశ్నకు జయప్రద సమాధానమిస్తూ ప్రజలు ఎటువైపు వెళ్లమని చెబితే తాను అటు వైపుకు వెళ్తానని జయప్రద చెప్పారు. రాజకీయాల్లో బిజీబిజీగా ఉండటంతోనే సినిమాల్లో నటించడం లేదని, సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమన్నారు.

ఇకపోతే.. జయప్రద వ్యాఖ్యలను బట్టి ఆమె తెలుగుదేశం లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిపాలనను గతంలో కొనియాడిన జయప్రద, ఎన్టీఆర్ కుటుంబమంటే ఎంతో అభిమానమని చెప్తూ వచ్చారు. ఫలితంగా జయప్రద తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments