యంగ్ లేడీ కోసం ఎదురుచూస్తున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Webdunia
గురువారం, 5 జులై 2012 (13:50 IST)
WD
మొన్నటి ఉప ఎన్నికల్లో విజయమ్మతోపాటు ప్రచార బరిలో వైఎస్సార్ కుమార్తె షర్మిల మాటల దాడికే అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం పార్టీలు మట్టికరిచాయన్న నిర్ణయానికి ఆ రెండు పార్టీల్లోని కొంతమంది నాయకులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ వైకాపాను ఎదుర్కోవాలంటే షర్మిల స్టామినాను ధీటుగా ఎదుర్కొనగల యువతి కోసం అటు తెదేపా ఇటు కాంగ్రెస్ పార్టీలు వెతికే పనిలో పడ్డట్టు సమాచారం.

తెలుగుదేశం పార్టీ అయితే ఈసరికే ఓ నిర్ణయానికి వచ్చేసిందట. బాలయ్య కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రహ్మణిని వచ్చే ఎన్నికల పర్యటనకు మహిళా నాయకురాలుగా బరిలో దింపాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే, ఇతర పార్టీలకు పోటీ గట్టిగానే ఉంటుంది. ఈ రేసులో వెనుకబడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. చిరంజీవి ఉన్నప్పటికీ ఆయన పురుషుల కోటాలో ఉన్నారు కనుక పార్టీ పథకాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుక వెళ్లగలిగే మహిళ కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఎదురుచూస్తున్నట్లు చెపుతున్నారు.

పార్టీలో ఉన్న మహిళా నాయకులు పథకాలను అంత సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోతున్నారన్న వాదన ఉంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ పథకాలను, ఇతర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగల సమర్థవంతమైన నాయకురాలుగా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments