Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొద్దుశీను శవపరీక్ష ఓ బూటకం: తెదేపా

Webdunia
అనంతపురం జిల్లా కారాగారంలో దారుణ హత్యకు గురైన మొద్దుశీను మృతదేహానికి నిర్వహించిన శవపరీక్ష కేవలం బూటకమని ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. తలపై తగిలిన బలమైన గాయం వల్లనే మొద్దు శీను మృతి చెందినట్లు డాక్టర్‌ ప్రభాకర్‌ ఇచ్చిన నివేదికను ఇటు తెదేపా నేతలు తప్పుపట్టారు. అలాగే.. హతుని భార్య రాజ్యలక్ష్మీతో పాటు.. బంధువులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అందువల్ల మొద్దుశీను మృతదేహానికి జడ్జి, మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించాలని మృతుల బంధువులతో పాటు తెదేపా శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా శవంతో వారు గుంటూరులో ధర్నా నిర్వహించారు. దీంతో గుంటూరు - నరసరావుపేట రహదారిలో కొద్ది సేపు వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి.

ఇదిలావుండగా మొద్దుశీను హత్యను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఎదురుదాడికి దిగారు. హంతకుని సంబంధీకులంతా తెదేపా వారేనంటూ వైఎస్సార్ ఆరోపించారు. అందువల్లే ఒక హంతకుని హత్యపై ఇంత రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments