Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుయాష్కీ మాట : సమైక్యాంధ్ర కల .. తెలంగాణ నిజం

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (16:52 IST)
File
FILE
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబులు అడ్డుపడినా ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదని టీ కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ జోస్యం చెప్పారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఒక నిజం.. సమైక్యాంద్ర ఒక కల అని వ్యాఖ్యానించారు.

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఆగదన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి తీరుతారని, ఆమె స్వదేశం రాగనే టీ నోట్ కేంద్ర మంత్రివర్గం ముందుకు వస్తుందన్నారు.

ఇకపోతే... హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, హైదరాబాద్ లేకుండా తెలంగాణ నిలదొక్కుకోలేదన్నారు. అందువల్ల హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి వేరు చేసే ఆలోచన కేంద్రానికి ఏమాత్రం లేదన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాటలు కేవలం ఉత్తమకుమార ప్రగల్భాలని మధుయాష్కి ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు ఇలా అందరూ అడ్డుకున్నా తెలంగాణ ప్రక్రియ అగదని ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రా?.. ఆంధ్రాప్రాంతానికా? అని యాష్కీ ప్రశ్నించారు. ఏపీఎన్జీవోల సభ తర్వాత ముఖ్యమంత్రిని ఆంధ్రా సీఎంగానే భావిస్తున్నామన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments