Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్లీపై సుప్రీం తీర్పుతో ఆంధ్రకు నిరాశ ... ఎర్రబెల్లి కన్నీరుమున్నీరు

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2013 (22:24 IST)
FILE
బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తెదేపా నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీరుమున్నీరయ్యారు. తెలంగాణ రైతుల వ్యవసాయ భూములు బీళ్లుగా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాం నుంచి తాము పోరాడుతున్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదనీ, రైతులకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా గురువారంనాడు సుప్రీంకోర్టు బాబ్లీపై తీర్పునిస్తూ... ఆంధ్ర గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్భయంగా పూర్తి చేసుకోవచ్చని, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపి వేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదన అర్థంలేనిదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.

దీంతో బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలో రాష్ట్రానికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. బాబ్లీ ప్రాజెక్టును తొలగించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మహారాష్ట్ర వాటా కింద నీటిని వాడుకునేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన పర్యవేక్షక కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.

త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్క ప్రతినిధిగా ఉంటారు. ఛైర్మన్‌గా కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడిని నియమించింది. బాబ్లీ ప్రాజెక్టు ద్వారా 2.75 టీఎంసీలు మాత్రమే మహారాష్ట్ర వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments