Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ పార్టీ: మెగా ఫ్యామిలీ రెండుగా చీలిక, ఫ్యాన్స్ కూడా!

Webdunia
శనివారం, 8 మార్చి 2014 (18:07 IST)
FILE
మెగాస్టార్ చిరంజీవికి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ల మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేసినా వరుణ్ తేజ సినిమా ఓపెనింగ్ సాక్షిగా వీరి మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. తాజాగా పవన్ ఈనె 14న తనపొలిటికల్ ఎంట్రీ గురించి మీడియా ముందుకు రానున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీలో మళ్లీ రచ్చ మొదలైంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసినప్పటి నుంచీ అన్నయ్యపై గుర్రుగా వున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేశాడు.

తాను సొంతంగా రాజకీయ పార్టీ పెట్టడానికి సమాయత్తమవుతున్నాడు. ఈ నేపథ్యంలో, ఈ ఫ్యామిలీలో అభిప్రాయభేదాలు వున్నాయంటూ గత కొంత కాలంగా మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవమేనన్న విషయాన్ని ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ ఆవేశపూరిత, ధిక్కార నిర్ణయంతో మెగా ఫ్యామిలీలో చీలిక ఏర్పడింది. చిరంజీవి, పవన్ వర్గాలుగా విడిపోతోంది.

తాను పవన్ బాబాయ్‌కి సపోర్ట్ ఇవ్వననీ, తండ్రికే ఇస్తాననీ ఇప్పటికే రామ్ చరణ్ ప్రకటించాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టీ నాగబాబుపై పడింది. ఈయన ఎవరి పట్ల మొగ్గు చూపుతాడన్నది అందరిలోనూ క్యూరియాసిటీ పెంచుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్‌కే నాగబాబు మద్దతు ప్రకటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే తన నిర్ణయాన్ని ఆయన బహిరంగంగా ప్రకటిస్తారని అంటున్నారు.

ఇక అభిమానులు కూడా రెండుగా చీలిపోతున్నారు. కొత్తతరం కుర్రాళ్ళు పవన్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ఏమైనా, నందమూరి ఫ్యామిలీలానే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా ఇలా వర్గాలుగా విడిపోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది!

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments