Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం : అది జగన్ స్క్రిప్టు!!

Webdunia
బుధవారం, 11 జులై 2012 (15:12 IST)
File
FILE
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఏక వచనంతో దూషించిన సొంత పార్టీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మూకుమ్మడి దాడికి దిగారు. చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టు రాసిస్తే కొడాలి నాని మీడియా ఎదుట చదివి వినిపించాడని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.

కొడాలి నాని వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. కొడాలి నానికి మతిభ్రమించిందని, అందుకే పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబును తిట్టే స్థాయి నానికి లేదని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ నా దైవం అంటున్న నాని.. వైఎస్ఆర్‌ను కూడా దేవుడితో పోల్చడమంటే.. ఎన్టీఆర్‌ను మరోమారు హత్య చేయడమేనన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై నాని అభాండాలు వేయడం సరికాదన్నారు. రాజకీయ స్వార్థంతోనే నాని సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు.

లోకేష్ రాజకీయ ప్రవేశంపై చంద్రబాబు ఇప్పటి వరకు ఆలోచించలేదని ఆయన స్పష్టం చేశారు. అయోమయంలో నాని ఏదేదో మాట్లాడేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబును తిట్టే నైతిక హక్కు కొడాలి నానికి లేదని ఆయన అన్నారు.

మరోనేత.. దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌పై మాట్లాడే అర్హత కొడాలి నానికి లేదన్నారు. చంద్రబాబును తిట్టినంత మాత్రాన కొడాలి నాని పెద్దవాడై పోడన్నారు. తెలుగుదేశం పార్టీని, గుడివాడ ప్రజలను అవమానించే విధంగా నాని వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొడాలి నాని వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తలాగే మాట్లాడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ అవినీతిపై తమ పార్టీ పోరాటం చేస్తున్న సమయంలో కొడాలి నాని ఆయనను కలవడం క్రమశిక్షణారాహిత్యమేనని యనమల అన్నారు. కొడాలి నానిని సస్పెండ్ చేయడం సరైందేనని తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments