Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి ముస్లిం నేత: కేసీఆర్

Webdunia
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తొలి ఉప ముఖ్యమంత్రి పదవిని ముస్లిం నేతకు ఇవ్వడమే కాకుండా, మైనారిటీ వర్గానికి చెందిన ఐదుగురిని మంత్రులను చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ముస్లింలకు ఆది నుంచి అన్యాయం జరుగుతోందన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ముస్లింను ఉప ముఖ్యమంత్రి చేస్తామని, ఐదుగురికి మంత్రి పదవులిస్తామని ఆయన హామీయిచ్చారు. సీమాంధ్ర నేతలకు ఇక్కడి ముస్లింల సంస్కృతి గురించి తెలియదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే వక్ఫ్ బోర్డ్ భూములను ఇంచు కూడా కబ్జా కానివ్వబోమన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరెంతో దూరంలో లేదన్నారు. గత యేడాది డిసెంబరులో కేంద్రం చేసిన ప్రకటనను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుపడక పోతే రాష్ట్ర ఏర్పాటు కల సాఫల్యమై వుండేదన్నారు. అలాగే, సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం నిజమైనది కాదని, పెట్టుబడిదారులు సృష్టించిన కృత్రిమ ఉద్యమం అని కేసీఆర్ అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments