Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మార్చ్‌లో సీమాంధ్రుల ఆస్తులను టార్గెట్ చేద్ధాం : యాష్కీ

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2012 (18:44 IST)
File
FILE
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇచ్చిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించడం కష్టమేనని ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో సోమవరాం సమావేశమయ్యారు.

ఈ భేటీ అనంతరం యాష్కీ మాట్లాడుతూ సంప్రదింపుల పేరుతో హైకమాండ్ తెలంగాణ అంశాన్ని దాటవేయడం లేదా సాగదీయడం సరికాదన్నారు. ఇదే ధోరణిని కొనసాగించినట్టయితే తెలంగాణలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ముఖ్యంగా తెలంగాణపై టీడీపీ స్పష్టత ఇస్తూ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తప్పవని యాష్కీ అభిప్రాయపడ్డారు.

ఎవరో 10 మంది సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ ఆస్తులను రక్షించుకోడానికే తెలంగాణతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ఎంపీల ఆస్తులు ముట్టడిస్తే తప్ప తెలంగాణ వచ్చేలా కనిపించడం లేదన్నారు. అందువల్ల సెప్టెంబర్ 30వ తేదీన జరుగనున్న తెలంగాణమార్చ్‌లో కూడా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల ఆస్తులను టార్గెట్‌గా చేసుకోవాలని యాష్కీ పిలుపునిచ్చారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments