తెలంగాణ మార్చ్‌కు వెళ్లే దమ్ము టి ఎంపీలకు లేదు : జగ్గారెడ్డి

Webdunia
మంగళవారం, 2 అక్టోబరు 2012 (17:22 IST)
File
FILE
సొంత పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీలపై ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మరోమారు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు నెక్లెస్‌ రోడ్డులో జరిగిన తెలంగాణ మార్చ్‌లో పాల్గొనే దమ్మూధైర్యం లేకే, సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారని ఆరోపించారు.

ఎంపీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, వారికి దమ్ము, ధైర్యం ఉంటే వారి ప్రతాపాన్ని ఢిల్లీలో చూపి తెలంగాణ తీసుకు రావాలని సవాల్ విసిరారు. పెద్దపల్లి ఎంపీ వివేక్ లేఖ అర్థం పర్థం లేనిదిగా ఉందన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సీఎంను విమర్శిస్తూ లేఖ రాయడం పార్టీని బజారుకీడ్చడమే అని మండిపడ్డారు.

రోడ్డుపై ఆందోళనలు, సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నాలు చేసి మీడియాకెక్కితే తెలంగాణ వస్తుందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మీడియా ముందు మాట్లాడటం, కిరణ్‌ను విమర్శించడం కాకుండా ఢిల్లీలో తేల్చుకోవాలని తెలంగాణ ఎంపీలకు ఆయన సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Show comments