Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని హైదారాబాద్‌పై మాట్లాడుకుందాం రండి

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2011 (13:13 IST)
WD
తెలంగాణాపై బిగుసుకున్న పీటముడిని విప్పేద్దాం రండంటూ తెలంగాణా కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర నాయకులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్, నీరు, నిధుల పంపకంపై చర్చించుకుంటే పరిష్కార మార్గం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.

శనివారం తెలంగాణా నేతలు సీనియర్ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు కె.కేశవరావు ఇంట్లో సమావేశమై తెలంగాణా సాధనకు అనుసరించాల్సిన మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు జానా రెడ్డి, సారయ్యలతోపాటు ఎంపీలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి తదితురలు పాల్గొన్నారు.

గతంలో పి. చిదంబరం మాట్లాడుతూ... తెలంగాణా అంశంపై ఓ పరిష్కార మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ నాయకులు, ప్రజలే కనుగొనాలని సూచించారు. లేని పక్షంలో తెలంగాణా అంశం ఎన్నేళ్లయినా... ఎన్నాళ్లయినా నాన్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్రం వైఖరిని తెలుసుకున్న తెలంగాణా ప్రాంత నాయకులు సీమాంధ్ర నాయకులతో మాట్లాడి ఏదోవిధంగా సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనాలని యోచన చేస్తున్నారు. మరి పరిష్కార మార్గం దొరుకుందో లేదో చూడాలి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments