Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కలి ఉప ఎన్నిక: ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2009 (10:56 IST)
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ ప్రారంభమైన గురువారం ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు.

అధికార పార్టీకి చెందిన రేవతీపతి హఠాన్మరణంతో టెక్కలి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున భారతమ్మ, తెదేపా అభ్యర్థిగా అచ్చెన్నాయుడు, ప్రరాపా తరపున దువ్వాడ శ్రీనివాస్‌లు బరలిలో ఉండటంతో ముక్కోణపు పోరు అనివార్యమైంది. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణంతో వచ్చిన సానుభూతి కారణంగా అధికార పార్టీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి.

అయితే, తెదేపా తరపున పోటీ చేస్తున్న తెదేపా సీనియర్ నేత కె.ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు మాత్రం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పాతికేళ్లుగా ప్రజా సేవకు అంకితమైన తమ కుటుంబాన్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments