Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వెంట వంగవీటి రాధ: వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరిక!?

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2011 (12:35 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రైతు మద్దతుగా విజయవాడలో చేపట్టిన మహాధర్నాలో వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. జగన్ వెంటనే ఉంటున్న వంగవీటిని జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. దీనిని బట్టి వంగవీటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది.

కాంగ్రెసు పార్టీకి చెందిన వంగవీటి రాధా చిరంజీవి పార్టీని స్థాపించినప్పుడు ప్రజారాజ్యంలోకి వెళ్లారు. చిరంజీవి తన పార్టీని విలీనం చేసినప్పుడు మిగతా ప్రజారాజ్యం పార్టీ నాయకులతో పాటు ఆయన కాంగ్రెసులో చేరలేదు. ఈ నేపథ్యంలో విజయవాడలో రైతు ధర్నా తలెపెట్టిన వైయస్ జగన్‌తో శనివారం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీ సందర్భంగా వంగవీటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే అంశంపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.

ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి చాలా ముందు రోజుల నుంచే రాధాకృష్ణ చిరంజీవికి దూరంగా ఉంటున్నారు. చిరంజీవి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. విజయవాడ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇటు కాంగ్రెసులోనూ అటు తెలుగుదేశంలోనూ ఇమిడే పరిస్థితి లేకపోవడంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments