Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుండూరు ఊచకోత నిందితులకు శిక్ష రద్దు చేసిన హైకోర్టు!!

Webdunia
మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (13:59 IST)
File
FILE
గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో 1991 సంవత్సరంలో జరిగిన దళితుల ఊచకోత కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 21 మంది నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.

అంతేగాకుండా ఇదే కేసులో 35 మందికి విధించిన ఏడాది జైలు శిక్షను కూడా న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో చుండూరులో సంబరాలు చేసుకోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించాలని గుంటూరు జిల్లా ఎస్పీని కోర్టు ఆదేశించింది.

చుండూరులో మూడు నెలల పాటు శాంతిభద్రతలను పరిరక్షించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాగా, హైకోర్టు తీర్పుపై దళిత నేత కత్తి పద్మారావు స్పందించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసి, దోషులకు శిక్షలు పడేలా చేస్తామని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

Show comments