Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు పాదయాత్రను ప్రపంచ రికార్డుల్లో చేర్చాలి : వైకాపా

Webdunia
బుధవారం, 1 మే 2013 (10:59 IST)
File
FILE
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించి వస్తున్నా మీకోసం పాదయాత్రకు ప్రపంచ రికార్డులో చోటు కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. ఇదే అంశంపై ఆ పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, ధర్మాన ప్రసాద రావులు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు అనేక ఘనకార్యాలు సాధించారన్నారు. అవన్నీ ప్రపంచ రికార్డుల్లో నమోదు చేయదగ్గవేనన్నారు. అధికార పార్టీతో కలిసి చంద్రబాబు మాయా కూటమిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు.

చంద్రబాబు పూర్తి చేసిన వస్తున్నా మీకోసం యాత్ర ఓ పాదయాత్రలా సాగలేదన్నారు. అది రాజుగారి విహార యాత్రలా సాగిందన్నారు. 2014 ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెసుతో కలిసి కూటమి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

చంద్రబాబు పాదయాత్ర చేపట్టిన 2012 అక్టోబర్ రెండో తేదీ నుంచి పాదయాత్ర ముగింపు రోజైన 2013 ఏప్రిల్ 27వ తేదీ వరకు సుమారు 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు జారుకున్నారని వారు గుర్తు చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments