Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త పార్టీతో కేసీఆర్‌కు షాకివ్వనున్న నాగం జనార్ధన్ రెడ్డి!

Webdunia
FILE
తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నాగం జనార్ధన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు ధీటుగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌కు ధీటుగా రాజకీయ పార్టీని రూపుదిద్దే కార్యచరణ తెరవెనక జరుగుతుందని సమాచారం.

నాగం జనార్దన్ రెడ్డితో పాటు శాసనసభా సభ్యత్వాలకు, తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేసిన శాసనసభ్యులు హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాలాచారి బయటకు కనిపిస్తున్నారు. నిజానికి, తెలంగాణ తాకిడి రంగారెడ్డి జిల్లాకు చెందిన హరీశ్వర్ రెడ్డికి అంతగా లేదు. అయినా, తెలంగాణ కోసమంటూ ఆయన రాజీనామా చేశారు. దీనిని బట్టి తెర వెనక రాజకీయం పురుడు పోసుకుంటోందని తెలిసింది.

మొత్తం మీద, పార్టీ పెట్టే ఆలోచన మాత్రం నాగం బృందానికి ఉందనేది అర్థమవుతోంది. తెలంగాణలోనే ఓ వర్గం కెసిఆర్‌కు దీటుగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి కాకుండా మరో నాయకుడు నాయత్వం వహించే అవకాశాలున్నాయని అంటున్నారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments