Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ కొంప కొల్లేరేనా..? టీఆర్ఎస్ పార్టీ ఖాళీనా? కాంగ్రెస్ ప్లాన్ ఏమిటి?

Webdunia
FILE
తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తుందని రాజకీయ పండితులు అంటున్నారు. తెలంగాణపై కేంద్రం ప్రకటన చేయడంతో కేసీఆర్ కొంప కొల్లేరేనని, టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అని వాదనలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్‌ను విలీనం చేసేందుకు కేసీఆర్ వెనక్కి తగ్గితే.. ఆ పార్టీలో ఇప్పుడున్న 18 మంది ఎమ్మెల్యేల్లో 17 మందిని ముందుగానే కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు కాంగ్రెస్ పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తరుణంలో, మరో ముగ్గురు మాజీ మంత్రులు కూడా అదే బాటలో పయనిస్తున్నారని తెలియవచ్చింది.

టిఆర్ఎస్‌కు ఉన్న ఇద్దరు ఎంపీల్లో ఒకరు కేసిఆర్ కాగా మిగిలింది విజయశాంతే, ఆమె ఖాలీ చేసారు. 18 మంది ఎమ్మెల్యేలుండగా ఆయన కుమారుడు కేటిఆర్‌ను పక్కనబెడితే మిగిలింది 17 మందే. వీరంతా కాంగ్రెస్‌లోకి చేరేందుకు కాంగ్రెస్ అన్ని చర్యలు తీసుకుందని రాజకీయ వర్గాల్లో టాక్ వస్తోంది.

వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి వెల్లి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలిసి చర్చలు జరిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ తుదిబిల్లు ప్రవేశపెట్టే ముందు వీరంతా టిఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరతామని డిగ్గీతో చెప్పినట్లు సమాచారం.

సో.. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన వెనుక అసలు అర్థమేమిటో.. వ్యూహమేమిటో దీనిని బట్టి తెలుసుకోవచ్చన్నమాట. టీఆర్ఎస్ విలీనమైతే ఆ పార్టీకి గౌరవం మిగులుతుంది.. లేదా ఆ పార్టీ నేతలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments