Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌... జగన్‌పై రాళ్లెందుకు వేయించలేదు: మందకృష్ణ

Webdunia
FILE
ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును సమయం దొరికినప్పుడల్లా తూర్పార బడుతూనే ఉన్నారు. కేసీఆర్‌కు ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన కులాలంటే చిన్నచూపని మహబూబాబాద్ ఘటన తేటతెల్లం చేస్తోందని చెప్పుకొచ్చారు. అదెలాగో ఆయనే వివరించారు.

వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకుంటామంటూ రోడ్డెక్కిన తెరాస కార్యకర్తలు మహబూబాబాద్‌లో వెనుకబడిన కులాలకు చెందిన నాయకులపై రాళ్ల దాడి చేశారు. అదే సమయంలో నల్గొండ జిల్లాలో వంగపల్లి వద్ద సుమారు మూడు గంటలపాటు రైల్లోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉంటే ఆయనపై కనీసం చిన్న కంకర రాయి కూడా వేయించలేదు. ఎందుకనీ...? అంటే... కేసీఆర్‌కు అగ్రకులాలపై ఉన్న ప్రేమే అని మందకృష్ణ విమర్శించారు.

కేసీఆర్ పైకి మాత్రమే దళితులను అక్కున చేర్చుకున్నట్లు నటిస్తారు తప్పించి ఆయన లోలోపల ఉన్నది వేరే అభిప్రాయం అని చెప్పారు. ఇకనైనా కేసీఆర్ తనలో గూడుకట్టుకుని ఉన్న అగ్రకులాభిమానాన్ని అందరినీ సమదృష్టితో చూడాలని డిమాండ్ చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments