Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్

Webdunia
ర్యాగింగ్ నిరోధకానికి ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాలు ఎన్నో రకాల నిబంధనలు విధించినా.. ఈ భూతం మాత్రం ఆగడం లేదు. దేశంలో ఏదో ఒక చోట.. ఏదో ఒక ప్రాంతంలో ర్యాగింగ్‌కు జూనియర్ విద్యార్థులు బలి పశువులు అవుతున్నారు. తాజాగా మన రాష్ట్రంలో మరో ర్యాగింగ్ కేసు నమోదైంది. వరంగల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులపై సీనయిర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో తమ ప్రతాపం చూపించారు. పీకలదాకా మద్యం సేవించి, జానియర్ విద్యార్థులను ర్యాగ్ చేశారు.

తమలాగే మద్యం సేవించాలని, పేకాట ఆడాలని, డ్యాన్సులు వేయాలని, సిగరెట్లు తాగాలని ఇలా.. రకరకాలుగా ర్యాగింగ్ చేశారు. వీటిని తట్టుకోలేని జూనియర్ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

దీనిపై వెంటనే స్పందించిన ప్రిన్సిపాల్ విచారణకు ఆదేశించారు. తమను సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో వేధిస్తున్నారని జూనియర్లు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments