Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు: దత్తన్న

Webdunia
కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు అనుసరిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. వీటితో విసిగిపోయిన దేశ ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. 'విజయ్‌ సంకల్ప్' యాత్రలో భాగంగా రాష్ట్ర రాజధానిలో జరుగనున్న పార్టీ అగ్రనేత అద్వానీ బహిరంగ సభతో రాష్ట్ర రాజకీయాల్లో నూతన సమీకరణాలకు తెరలేస్తుందని చెప్పారు.

ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం, పెరిగిన ధరలు, ఓటుబ్యాంకు రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పతనం ప్రారంభమైందన్నారు. కేంద్ర రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారును గద్దెదించడం ఖాయమన్నారు. పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన మొద్దుశ్రీనును అప్రూవర్‌గా మారాడనే నెపంతో జైలులోనే హత్య చేయించారని ఆరోపించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments