Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు జిల్లాల్లో వర్ష బీభత్సం: రేపు సీఎం ఏరియల్ సర్వే

Webdunia
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. భారీవర్షం తాకిడికి వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో సుమారు 90 వేల హెక్టార్లకు పైగా వరి పంట నీటి పాలైనట్లు ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇక కృష్ణా జిల్లాలో అరటి పంట నేలమట్టమైంది. చేతికి వచ్చిన వరిపంట నీటి పాలైంది. సుమారు 45 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న వరి పంట చేతికి రాకుండా పోవడంతో అన్నదాతలు భోరుమంటున్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో సైతం పంట తీవ్రత ఎక్కువగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 40 వేల ఎకరాలకు పైగా వరి పంటకు నష్ట వాటిల్లినట్లు అంచనా. తూర్పుగోదావరిలో 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంటతోపాటు రెండు వేల 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి.

శ్రీకాకుళం జిల్లాకు భారీగా నష్టం వాటిల్లింది. ఇక్కడ సుమారు 50 వేల హెక్టార్ల మేర వరి పంట మట్టిలో కలిసి పోయింది. వర్షం మిగిల్చిన తీవ్ర నష్టాన్ని రేపు ఉదయం ఏరియల్ సర్వే ద్వారా అంచనా వేయనున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments