Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్వస్థతకు గురైన అక్కినేని నాగేశ్వర రావు: ఆస్పత్రికి...

Webdunia
బుధవారం, 8 జనవరి 2014 (09:48 IST)
File
FILE
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (90) అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో, తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు స్వయంగా వెల్లడించి అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేశారు.

కొద్ది రోజుల క్రితం వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స కూడా చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం ఒడిదుడుకులకు గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాగా రెండురోజుల కిందట ఆయన బాగా నీరసపడి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికే ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు వచ్చి చికిత్సనందిస్తున్నారు.

ఆయన కుమారుడైన ప్రముఖ సినీ హీరో నాగార్జున, ఇతర కుటుంబసభ్యులు ప్రతి రోజూ ఆయన ఇంటికి వచ్చి కొన్ని గంటలపాటు అక్కడే ఉండి వెళుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, వైద్యానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments