Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరికీ శుభం జరగాలి: ముఖ్యమంత్రి రోశయ్య

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2010 (15:05 IST)
నూతన సంవత్సరం 2010లో అన్ని వర్గాల ప్రజలకు శుభం జరగాలని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడచిన ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విపత్కర పరిణామాలు చోటుచేసుకున్నాయని, వాటిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ దుర్మణం చెందడం తనలాంటివారికి కలసివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దివంగత వైఎస్ఆర్ దుర్మరణం చెందడం అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు రాష్ట్ర ప్రజలకు తీరని లోటని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. నిరుడు రాష్ట్రంలో వరదలు ముంచెత్తాయని, అలాంటి వరద తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. అలాగే వరద ముంపుకు గురైన ప్రాంతాలలోని ప్రజలు పలు అవస్థలకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో చేపట్టిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం ప్రకృతి సహకరించాలని, నిరుడులా కాకుండా సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు చేతికి అందితే అదే అందరికి శుభం చేకూరినట్లని ఆయన అభిప్రాయపడ్డారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments