Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ మృతదేహం హైదరాబాద్‌కు తరలింపు

Webdunia
నల్లమల అడవుల్లో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికకాయాన్ని కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. గురువారం సాయంత్రం 4.35 గంటల సమయంలో వైఎస్ మృతదేహాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో కర్నూలు నుంచి అధికారిక యంత్రాంగం హైదరాబాద్ తీసుకెళ్లింది.

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి ఈ హెలికాఫ్టర్ వెళుతుంది. అక్కడికి వెళ్లిన తరువాత వైఎస్సార్ భౌతికకాయాన్ని ఎక్కడికి తీసుకెళ్లనున్నారనే దానిపై వివిధ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌తోపాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన మిగిలిన నలుగురి మృతదేహాలను వారి నివాసాలకు పంపుతారు.

వైఎస్ భౌతికకాయాన్ని అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం శుక్రవారం ఉదయం ఎల్బీ స్టేడియంలో ఉంచుతారు. శుక్రవారం సాయంత్రం పులివెందులలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళుతున్న వైఎస్సార్ మార్గమధ్యంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments