Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీ లాండరింగ్ కేసు : వైఎస్.జగన్‌కు ఈడీ నోటీసులు జారీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2011 (18:10 IST)
మనీ లాండరింగ్, ఫెమా చట్టాల కింద కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు గురువారం జారీ చేసింది. ఈనెల 28వ తేదీ లోపు తమ అధీకృత ప్రతినిధి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. జగన్‌కు చెందిన సాక్షిని నడుపుతున్న జగతి పబ్లికేషన్స్‌లోకి అక్రమంగా నిధులు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే.

జగన్ తన తండ్రి హయాంలో ప్రభుత్వం తరపున పలు కంపెనీలకు ఆయాచితంగా భూముల వంటివి కట్టబెట్టి వారి నుంచి విదేశాల ద్వారా తన కంపెనీల్లోకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధుల ప్రవాహంపై వివరణ ఇచ్చే నిమిత్తం జగన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

కాగా ఇటీవల కర్ణాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ ముందు హాజరైన విషయం తెల్సిందే. ఇప్పుడు జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలితే శిక్షతో పాటు రెండు రెట్లు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నట్లు ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments