Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ముఖ్యమంత్రిని కావడం కొందరికి ఇష్టం లేదు : కేఏ పాల్

ఠాగూర్
శనివారం, 6 ఏప్రియల్ 2024 (10:32 IST)
తాను ముఖ్యమంత్రిని కావడం కొందరికి ఇష్టం లేదని ప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ మత బోధకుడు కేఏ పాల్ అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే విశాఖపట్టణాన్ని డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు.
 
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏడు ప్రధాన అంశాలతో ఎన్నికలకు వెళుతున్నామన్నారు. మంచి పాలన కావాలనుకునే వాళ్ళంతా ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖను రాజధానిని చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్టణాన్ని మరో వాషింగ్టన్ చేస్తామని తెలిపారు. అలాగే, తాను ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రానికి ప్రస్తుతమున్న రూ.13 లక్షల కోట్ల అప్పు తీరిపోతుందన్నారు. అయితే, తాను ముఖ్యమంత్రిని కావడం కొందరికి ఇష్టం లేదని చెప్పారు. 
 
తాను ముఖ్యమంత్రి అయితే, ఉత్తరాంధ్రలో ఏటా రూ.2 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని కేఏ పాల్ అన్నారు. విశాఖను డ్రగ్స్, గంజాయి రహిత నగరంగా మారుస్తానని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతానని చెప్పారు. తన పోరాటం కారణంగానే ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నికలు మే నెలలో జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 
 
సింగిల్‌గా వస్తానని.. శవాలతో వస్తున్న జగన్‌ : నాలా లోకేశ్ 
 
ఎన్నికలకు సింగిల్‌గా వస్తానని చెప్పిన జగన్‌ శవాలతో వస్తున్నారని.. 2014లో తండ్రి, 2019లో బాబాయ్‌ మరణాల్ని చూపి సానుభూతి పొందినట్లే.. ఇప్పుడు పింఛనుదారుల మరణాలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దుయ్యబట్టారు. గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్‌, వైకాపా బీసీసెల్‌ నేత తాడిశెట్టి మురళీమోహన్‌ సహా పలువురు ముఖ్యనేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, జగన్‌ రెడ్డి 2019లో బాబాయ్‌ను చంపేసినట్లే.. ఇప్పుడు వృద్ధుల ఉసురుతీయడానికి సిద్ధపడ్డారని విమర్శించారు. 
 
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక పింఛను, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే అందిస్తామన్నారు. చంద్రబాబు 2019లో హామీ ఇవ్వకపోయినా పింఛనును రూ.1000 నుంచి రూ.2 వేలకు పెంచారని గుర్తు చేశారు. జగన్‌ పాలనలో బీసీ సోదరులపై 26 వేలకు పైగా అక్రమ కేసులు నమోదు చేశారని,  బాపట్ల జిల్లాలో అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్‌నాథ్‌గౌడ్‌ అనే బాలుణ్ని పెట్రోల్‌ పోసి దారుణంగా చంపారన్నారు. 
 
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి వారికి వృత్తి పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. మసీదుల మరమ్మతులకు నిధులు, దుల్హన్‌ పథకం, విదేశీ విద్య ద్వారా మైనారిటీలను ఆదుకుంటామన్నారు. రాష్ట్రం రూ.12 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, ఈ పరిస్థితిలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరమన్నారు.
 
ఐదేళ్ల క్రితం వరకు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఆంధ్రులకు ఒక గుర్తింపు ఉండేదని.. సీఎం జగన్‌ ఇప్పుడు రాష్ట్రాన్ని దక్షిణ భారత బీహార్‌గా మార్చారని లోకేశ్‌ మండిపడ్డారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంస పాలనపై గురువారం రాత్రి దాదాపు 1000 మంది ఎన్నారైలతో లోకేశ్‌.. దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. వారంతా స్వదేశానికి వచ్చి రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తెదేపా ఎన్నారై, గల్ఫ్‌ ఎన్నారై విభాగాల అధ్యక్షులు రవి వేమూరి, రావి రాధాకృష్ణ పాల్గొన్నారు.
 
అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీల్ని బలితీసుకుంటారు జగన్‌రెడ్డీ? అని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా పెండ్లిమర్రిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులు హత్యపై ఎక్స్‌ వేదికగా శుక్రవారం స్పందించారు. ‘‘జగన్‌ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ముఠా శ్రీనివాసులు భూమిని కబ్జా చేసి, అత్యంత దారుణంగా హతమార్చింది. కాపాడాల్సిన ఎస్సై సునీల్‌కుమార్‌రెడ్డి హంతకులకు మద్దతుగా నిలిచారు’’ అని లోకేశ్‌ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments