Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు : స్వతంత్ర అభ్యర్థులకు జనసేన గుర్తు కేటాయింపు ... హైకోర్టులో పిటిషన్

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (14:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపా నేతలు అధికారులను అడ్డుపెట్టుకుని మరో అరాచకానికి తెరలేపారు. జనసేన ఎన్నికల గుర్తును ఆ పార్టీ అభ్యర్థులు పోటీలోలేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఉద్దేశ్యపూర్వకంగా కేటాయిస్తుంది. జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించింది. ఈ నిర్ణయంపై జనసేన పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీలు కలిసి హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. బుధవారం విచారణ చేపట్టనుంది. 
 
ఏపీలో జనసేన పోటీ చేయని స్థానాల్లో ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థుకు ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా కేటాయిస్తుంది. దీనిపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ రిటర్నింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్ వేసింది. గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌‍లో కోరింది. జనసేన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు, ఇదే అంశంలో తమ వాదనలు కూడా వినిపించేందుకు టీడీపీ కూడా అనుబంధ పిటిషన్ వేసింది. 
 
జనసేన పోటీ చేయని స్థానాల్లో కూటమి తరపున టీడీపీ లేదా బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారని గుర్తు చేశారు. ఈ స్థానాల్లో గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం వల్ల జనసేన మద్దతుదారులు తికమకపడే అవకాశం ఉందని, అందువల్ల గాజు గ్లాసును జనసేన గుర్తుగా భావించి ఇండిపెండెంట్ అభ్యర్థులకు పొరపాటున ఓటు వేసే అవకాశం ఉందని, అదే జరిగితే కూటమికి నష్టం జరుగుతుంది. అందుకే జనసేన, టీడీపీలు హైకోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments