Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభ్యర్థిగా ప్రకటించగానే పత్తాలేకుండా పారిపోయిన టీడీపీ నేత

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (17:32 IST)
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒకరు పత్తాలేకుండా పారిపోయారు. ఆ అభ్యర్థి పేరు తెర్లాం పూర్ణ. చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కేటాయించింది. కానీ, నామినేషన్ల ప్రక్రియ మొదలైనా కొందరు టీడీపీ అభ్యర్థులు మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారు.
 
అలాంటివారిలో ఈయన ఒకరు. టికెట్‌ కేటాయించి రోజులు గడుస్తున్నా పోటీ చేయలేనని ఆయన చేతులెత్తేశారు. తనకు టికెట్‌ వద్దంటూ పూర్ణం అందుబాటులో లేకుండా పోయారు. రెండు రోజుల క్రితమే ఐవీఆర్‌ఎస్‌ సర్వేల ద్వారా తనను ఎంపిక చేశారని అతను వెల్లడించినట్టు సమాచారం. 
 
అయితే, పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలితకుమారికే టికెట్‌ అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో లలితకుమారి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. 
 
కానీ, ఆమెకు చంద్రబాబు షాకిచ్చారు. టీడీపీ విడుదల చేసిన తుది జాబితాలో పూతలపట్టు టికెట్‌ను పూర్ణం అనే కొత్త వ్యక్తికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆయన మాత్రం పోటీ చేయలేనని చేతులెత్తేశారు. ఇక ఈ స్థానం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంఎస్‌ బాబు బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments