మంగళగిరిలో నారా లోకేశ్‌పై ఇండిపెండెంట్‌గా తమన్నా పోటీ?!

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (12:50 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రంజుగామారింది. అనేక మంది కీలక నేతలు తమకు అనుకూలంగా ఉండే స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇలాంటి వారిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒకరు. ఈయన గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరి దృష్టి ఈ స్థానంపై కేంద్రీకృతమైంది. ఇక్కడ నుంచి వైకాపా అభ్యర్థిగా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే, జనసేన పార్టీ తరపున చల్లా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. 
 
దీంతో ఈ స్థానం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుంచి తమన్నా పోటీ చేస్తున్నారు. తమన్నా అంటే హీరోయిన్ తమన్నా కాదు. ఓ ట్రాన్స్‌జెండర్ (హిజ్రా). ఈ తమన్నా సింహాద్రి మంగళగిరి అసెంబ్లీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది.
 
దీనిపై తమన్నా స్పందిస్తూ, ప్రజా సేవ చెయ్యాలనే సంకల్పంతో పోటీ చేయ్యాలని నిర్ణయించినట్టు చెప్పారు. జనసేన పార్టీ నాకు టిక్కెట్ ఇస్తుందని భావించానని, ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గం నుండి ట్రాన్స్‌జెండర్‌లు పోటీ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments