Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలు ఖరారు

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (13:43 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాల పేర్లను ఆ పార్టీ కార్యవర్గం మంగళవారం ఖరారు చేసింది. ఆయన తన అన్న చిరంజీవి గతంలో పోటీ చేసినట్టుగానే రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు. 
 
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్టణం జిల్లా గాజువాక స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన నుంచి ప్రకటన వెలువడింది. నామినేషన్ దాఖలు చేసే రోజును ఈ మంగళవారం లేదా బుధవారం ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.

నిజానికి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలపై విస్తృతంగా చర్చ జరిగింది. అదేసమయంలో జనసేన కార్యవర్గం సభ్యులు కూడా ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అంశంపై సర్వే కూడా నిర్వహించారు. 
 
ఈ సర్వేలో అనంతపురం, తిరుపతి, రాజానగరం, భీమవరం, పిఠాపురం, పెందుర్తి, గాజువాక, ఇచ్ఛాపురంలు అగ్రస్థానంలో నిలిచాయి. ఈ 8 స్థానాలపై జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు అంతర్గత సర్వేను నిర్వహించారు. అనంతరం భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేయాలని పవన్‌కు సూచించారు. వారి సూచన మేరకు ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు.
 
కాగా, గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కూడా రెండు స్థానాల్లో పోటీ చేశారు. వాటిలో ఒకటి తిరుపతి కాగా, రెండోది పాలకొల్లు. ఇందులో తిరుపతి నుంచి చిరంజీవి గెలుపొందగా, పాలకొల్లు నుంచి చిత్తుగా ఓడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments