Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం.. గెల‌వ‌డం కోసం అదే గెస్ట్ హౌస్‌కి వెళ్తున్న బాల‌య్య‌..!

Webdunia
బుధవారం, 22 మే 2019 (15:57 IST)
లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మ‌రికొన్ని గంట‌ల్లో రానున్నాయి. దీంతో అంద‌రిలో ఒకటే ఉత్కంఠ‌. అస‌లు జ‌ర‌గ‌నుంది..? ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయి..? కేంద్రంలో బీజీపీ మ‌ళ్లీ అధికారం కైవ‌సం చేసుకుంటుందా..? లేక కాంగ్రెస్ పార్టీ అధికారం ద‌క్కించుకుంటుందా..? ఇక ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా..? లేక జ‌గ‌న్ అధికారం కైవ‌సం చేసుకుని సిఎం అవుతారా..? అనే ఉత్కంఠ ఏర్ప‌డింది. 
 
ఎవ‌ర్ని క‌దిపినా ఇదే టాపిక్. దీంతో పాటు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా అనే అంశంపై కూడా టీడీపీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 
 
ఒకవేళ హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతే... టీడీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటివరకు ఆ పార్టీ చేజారని కంచుకోటను ఇతర పార్టీకి అప్పగించిన బ్యాడ్ రికార్డ్ బాలయ్య సొంతం అవుతుంది. 
 
ఈ నేపథ్యంలో హిందూపురం ఫలితం ఏవిధంగా ఉంటుందనే అంశంపై టీడీపీ శ్రేణులతో పాటు బాలకృష్ణ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే ప్రతి విషయంలో సెంటిమెంట్లను ఫాలో అయ్యే హీరో బాలకృష్ణ... ఫలితాలు వెలువడబోయే మే 23న కూడా ఓ సెంటిమెంట్‌ను ఫాలో కాబోతున్నారని తెలుస్తోంది.
 
 
 
ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏంటంటే... 2014 ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ... కౌంటింగ్ సమయంలో ఆర్డీటీ స్టేడియంలో బస చేశారు. ఇప్పుడు కూడా ఆయన అక్కడే బస చేయనున్నారు. అంతేకాదు గత ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆయన రూమ్ నంబర్ 9లో ఉన్నారని... అందుకే ఈసారి కూడా అదే రూమ్‌లో బస చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. 
 
మొత్తానికి ఎన్నికల ఫలితాల రోజు కూడా సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్న బాలకృష్ణను విజయం వరిస్తుందో లేదో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు ఆగాల్సిందే. పాపం..బాల‌య్య ఆఖ‌రికి గెల‌వ‌డం కోసం ఇలా సెంటిమెంట్ ను న‌మ్ముకున్నాడ‌ట‌..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments