Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2007 (13:15 IST)
WD
ఆరు పదుల భారతదేశ చరిత్రలో దేశ అత్యున్నత పీఠాన్ని ఒక మహిళ అధిరోహించడం 2007లో జరిగింది. ఆమె ప్రతిభా దేవీ సింగ్ పాటిల్. ఈమె దేశ అత్యున్నత పీఠాన్ని గత జులై 27వ తేదిన అధిరోహించారు. ఈ రోజు.. భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ రోజుగా మిగిలిపోయింది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఓటమి ఎరుగని మహిళా నేతగా పేరుగడించిన ఈమె.. మహారాష్ట్రలోని జల్‌గావ్‌కు యాభై కిలోమీటర్ల దూరంలోని నద్‌గావ్‌లో డిసెంబర్ 19, 1934లో జన్మించారు.

ఆమె అసలు పేరు ప్రతిభా తాయి పాటిల్. మారుమూల పల్లె ప్రాంతంలో పుట్టినప్పటికీ, ఉన్నత విద్య నేర్చుకోవాలన్న ఆశయమే ఆమెను తారా స్థాయికి చేర్చింది. జల్‌గావ్‌లోని ఆర్.ఆర్.స్కూల్లో ప్రాధమిక విద్య పూర్తి చేసిన అనంతరం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యను పూర్తి చేసి, ముంబైలోని గవర్నర్ లా కాలేజ్ నుంచి న్యాయవాద పట్టాను పొందారు.

చదువుకునే రోజుల్లో టేబుల్ టెన్నిస్ క్రీడలో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన ప్రతిభాపాటిల్.. 1962లో జరిగిన కళాశాల స్థాయి క్వీన్ పోటీల్లో విజేతగా నిలిచారు. 27 ఏళ్ళ వయస్సులో, అంటే 1962లో మహారాష్ట్రలోని ఎదలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి విజయాన్ని రుచిచూశారు. అలా ప్రారంభమైన ఆమె రాజకీయ పయనం 2007లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల వరకు అప్రహతికంగా కొనసాగింది. తన రాజకీయ జీవితంలో ప్రతిభ వివిధ మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.

1978 నాటి ఎమర్జెన్సీ కాలంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయి ముఖ్యనేతలందరూ దేవరాజ్ నాయకత్వంలో కాంగ్రెస్ యూ.ఆర్.ఎస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నా, ప్రతిభ మాత్రం పార్టీలోనే ఉండిపోయారు. 1978లో కాంగ్రెస్ యూఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు పాటిల్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

సంజయ్ గాంధీ చనిపోయిన సమయంలో ఇందిరాగాంధీకి మరింత దగ్గరై, ఆమెకు సపర్యలు చేశారు. ఇందిరా కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యమే ప్రతిభా పాటిల్‌ను దేశ అత్యున్నత పీఠంపై కూర్చొబెట్టేలా చేసింది. ఇలా దేశ ప్రథమ పౌరులారిగా కొనసాగుతున్న ప్రతిభా పాటిల్‌కు 1965 జులైలో మహారాష్ట్రకు చెందిన దేవీ సింఘ్ రాన్ సింఘ్ షెకావత్‌తో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

Show comments