ఊపందుకున్న స్థానిక స‌మ‌రం... జెడ్పీటీసీ నామినేష‌న్ల దాఖ‌లు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (17:54 IST)
ఏపీలో స్థానిక స‌మ‌రం ఊపందుకుంది. గ‌తంలో జ‌రిగిన జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో మిగిలిన స్థానాల‌కు ఇపుడు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పోటాపోటీగా నామినేషన్లు దాఖ‌లు చేస్తున్నాయి. 

 
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పెడన జడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా దివంగత మాజీ జడ్పీటీసీ గుడిశేవ రమేష్ సతీమణి గుడిశేవ లక్ష్మీరాణి నామినేషన్ దాఖలు చేశారు. పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ తో కలిసి, పెడనలోని వైసీపీ కార్యాలయం నుండి మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయానికి భారీ ఊరేగింపుగా తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి అయిన జడ్పీ సీఈఓ సూర్య ప్రకాశరావుకు త‌మ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

 
తెలుగుదేశం ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా, వైసీపీదే అంతిమ విజ‌య‌మ‌ని త‌మ‌దేన‌ని ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పేర్కొన్నారు. ఇప్ప‌టికే అసెంబ్లీ మొద‌లుకొని, గ్రామ‌స్థాయి ఎన్నిక‌ల వ‌ర‌కు అన్నింటిలో వైసీపీదే ఘ‌న విజ‌య‌మ‌ని, ఇదే పంథా కొన‌సాగుతోంద‌న్నారు. ఏపీలో సీఎం జ‌గ‌న్ పాల‌న‌కు రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ స‌మ్మ‌తిని ఓటు రూపంలో తెలియ‌జేస్తున్నార‌ని జోగి ర‌మేష్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments